RRB NTPC, Group D, ALP వంటి రైల్వే ఉద్యోగాలకి ఏటా లక్షల మంది యువత సన్నద్ధం అవుతూ ఉంటారు. అయినప్పటికీ లక్ష్యాన్ని అతి కొద్దిమంది మాత్రమే చేరుకోగలుగుతున్నారు. ఇలా జరగడానికి కారణం ఏమిటని ఆలోచిస్తే పరీక్షలను ఏ కోణంలో చూడాలి? అందుకు ఎలా సన్నద్ధం కావాలనే విషయంపై అనేక మంది అభ్యర్ధులకు సరైన అవగాహన లేదనే విషయం బహిర్గతం అవుతుంది. అభ్యర్ధులలో చాలామంది ప్రతిభావంతులే అయినప్పటికీ సరైన ప్రణాళిక లేకపోవడంతో పరీక్షలలో విజయం సాధించలేకపోతున్నారు. 2025లో మీరు రైల్వే ఉద్యోగం పొందాలని నిజంగా కోరుకుంటున్నారా? అయితే, ఇప్పటి నుంచే సరైన ప్రణాళికతో ముందుకు సాగితే విజయం సాధించడం కష్టమేమి కాదు.. ఈ బ్లాగ్(JOBSINFOTELUGU.IN)లో మీ లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో, ప్రిపరేషన్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ వివరిస్తాం.
✅ 1. మీ లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ధారించుకోండి!
సాధారణంగా పోటీ పరీక్షలు అనేసరికి అన్ని ఒకేలా ఉంటాయనే భ్రమతో అన్నిటికీ ప్రిపేర్ అవుదాం అనే ఉద్దేశ్యంతో ఉంటారు. ఏ పోస్ట్ కు సిద్ధమవుతున్నాం అనే విషయంలో అనేక మంది అభ్యర్ధులలో సరైన స్పష్టత లేదు. ఒకేలా కనిపించినప్పటికి ప్రతి పోటీ పరీక్ష తనదైన శైలిలో విభిన్నంగా ఉంటుంది. కావున ముందుగా మీరు ఏ పోస్టుకి సిద్ధం అవుతున్నారో స్పష్టంగా నిర్ధారించుకోండి. వేర్వేరు సిలబస్ గల పరీక్షలను వెంటవెంటనే ప్రిపేర్ కావడం వలన, కన్ఫ్యూషన్ పెరిగే అవకాశం ఉంది. (సిలబస్ దాదాపుగా ఒకేలా ఉండే పరీక్షలకు ఇది మిహాహాయింపు)
ముందుగా మీరు ఏ పోస్టుకి సిద్ధమవుతున్నారు అనే విషయంపై స్పష్టత తెచ్చుకోండి.
- NTPC లోని Graduate Level Jobs (Station Master, Goods Guard…)?
- Intermediate Level Jobs (Junior Clerk, Trains Clerk…)?
- Group D ఉద్యోగాలు?
- RRB ALP
👉 ఒకసారి టార్గెట్ క్లియర్ అయితే, సిలబస్, పరీక్ష విధానం, అవసరమైన స్టడీ మెటీరియల్ అన్నీ సమకూర్చుకోవడం సులభం అవుతుంది.
📚 2. సిలబస్ పూర్తిగా అర్ధం చేసుకోవడం
నిర్ధారించుకున్న పరీక్షకు సన్నద్ధం అవడంలో తొలిమెట్టు సిలబస్ ను పూర్తిగా అర్ధం చేసుకోవడమే. సిలబస్ పట్ల సంపూర్ణ అవగాహన మీ సన్నద్ధతను మరింత సమర్ధవంతంగా మార్చుతుందనడంలో ఆశ్చర్యం లేదు. ఉదాహరణకు మీరు ntpc ఎక్సామ్ కు ప్రిపేర్ అయినట్లైతే CBT 1 & CBT 2 సిలబస్‌ను ప్రింట్ తీసుకుని, ప్రతిరోజూ చదవాల్సిన టాపిక్స్ గుర్తించండి.
👉 డౌన్లోడ్ లింక్: [RRB NTPC సిలబస్ PDF]https://rrbsecunderabad.gov.in/
📆 3. టైమ్ టేబుల్ తయారు చేసుకోండి – consistency ముఖ్యం
ప్రస్తుతం RRB ఉద్యోగాలకై తీవ్ర పోటీ నెలకొని ఉంది. కానీ ప్రణాళికా బద్దంగా ప్రిపేర్ అయితే ఉద్యోగం సాధించడం సాధ్యమే. ఇందుకు ప్రతిరోజూ కనీసం 5-6 గంటలు చదవటం ముఖ్యం. కేవలం సమయాన్ని గంటల రూపంలోనే గాక, నిర్ధేశిత సమయంలో ఎంత నేర్చుకున్నారో బేరీజు వేసుకోవడం కూడా తప్పనిసరి. కాబట్టి రోజుకు కనీసం 5–6 గంటలు క్రమం తప్పకుండా చదవడం అలవాటు చేసుకోండి.
డ్రాఫ్ట్ ప్లాన్:
| సమయం | సబ్జెక్ట్ |
| 6:00 AM – 8:00 AM | మాథ్స్ ప్రాక్టీస్ |
| 10:00 AM – 11:30 AM | జెనరల్ అవేర్నెస్ |
| 4:00 PM – 5:00 PM | రీజనింగ్ |
| 7:00 PM – 8:00 PM | కరెంట్ అఫైర్స్ & రివిజన్ |
| 9;00 PM- 10:00 PM | రివిజన్ |
ఇలా మీకు అనువైన ఒక ప్రణాళిక సిద్దం చేసుకోండి.
🧠 4. మీ బలం మరియు బాలహీనతలను గుర్తించండి
ప్రతి అభ్యర్ధికి ఒక ప్రత్యేక సామర్ధ్యం మరియు ప్రత్యేక ఆసక్తులు ఉంటాయి, కావున మీరు ఏ సబ్జెక్ట్ లో బలంగా ఉన్నారో, ఏ సబ్జెక్ట్‌లో బలహీనంగా ఉన్నారో నిజాయితీగా సమీక్షించుకొని ఆయా సబ్జెక్ట్స్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.
- మాథ్స్ లో Time & Work, SI & CI MENSURATION లో వీక్ అయితే, వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టండి.
- రీజనింగ్ లో Puzzles, Seating Arrangement మీకు టఫ్ అనిపిస్తే రోజూ ప్రాక్టీస్ చేయండి.
📝 5. మాక్ టెస్ట్ & ప్రీవియస్ పేపర్స్
నిజమైన అభ్యర్ధిగా పోటీలో ఉండాలంటే రోజూ 1 మాక్ టెస్ట్ రాయడం అలవాటు చేసుకోండి. అలాగే పాత ప్రశ్నపత్రాలను విశ్లేషించుకొని ప్రశ్నల సరళికి తగ్గట్టుగా సాధన చేయండి.
📘 6. బెస్ట్ బుక్స్ ఎంపిక
మార్కెట్లో నేడు అనేక పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఎక్కువ పుస్తకాలు కొని తక్కువ చేదివే కన్నా, తక్కువ పుస్తకాలు కొని ఎక్కువ సార్లు చదవడం వలన మెరుగైన ఫలితాలు వస్తాయి. ప్రామాణికమైన కొన్ని పుస్తకాలను ఎంపిక చేసుకుని అందులో అంశాలను ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయడం ఉత్తమం.
కొన్ని పుస్తకాలను ఈ కింద తెలియజేస్తున్నాం
Maths:
- R.S Agarwal
- Magical Book on Quicker Maths
Reasoning:
- Kiran Publication
- Arihant Logical Reasoning
GA:
- Lucent GK
- Telugu Academy (for basics)
- ncert text books for general science
🔄 7. డైలీ రివిజన్ – వీక్ మాక్ టెస్ట్ – మంత్లీ రివిజన్
మీ preparation ని వారాంతంలో mock test ద్వారా అంచనా వేయడం తప్పనిసరి. అదేవిధంగా నెలలో ఒక గ్రాండ్ టెస్ట్ రాస్తూ పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలి.
- ప్రతి రోజూ రివిజన్ కోసం 30 నిమిషాలు కేటాయించండి
- ప్రతివారం 1 ఫుల్ లెంగ్త్ టెస్ట్
- ప్రతి నెల సిలబస్ మళ్లీ తిరగవేయండి
✨ 8. మోటివేషన్ కోల్పోకండి – సరైన సర్కిల్ అవసరం
ప్రతిరోజూ చదవడం, డిసిప్లిన్ పాటించడం ఈ జర్నీలో కీలకం. మిమ్మల్ని ప్రోత్సహించే ఫ్రెండ్స్, టెలిగ్రామ్ గ్రూప్స్ జాయిన్ అవ్వండి. నెగటివ్ కామెంట్స్, డౌట్స్ నుండి దూరంగా ఉండండి. మీపై మీరు నమ్మకాన్ని ఉంచుకొని ప్రిపేర్ అవ్వడం ముఖ్యం. వైఫ్యల్యాలను స్వీకరించి, వాటిని అధిగమించే లక్షణాన్ని పెంపొందించుకోవాలి.
🔚 చివరి మాట:
2025 లో మీరు RRB ఉద్యోగాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారంటే, అది సాధ్యమే. సరైన ప్రణాళిక, క్రమశిక్షణ, మరియు నమ్మకం ఉంటే దీనిని సాధించడం సులభమే. మీరు ఇప్పుడు ప్రయత్నాన్ని మొదలు పెడితే, ఫలితం రావడం అసాద్యమేమీ కాదు.
📢 “తక్కువ సమయంలో విజయం కష్టమే – కాని అసాధ్యం కాదు!”
👉 మీకు అవసరమయ్యే ప్రీపరేషన్ టిప్స్, PDF’s, మాక్ టెస్ట్స్ అన్నీ ఇక్కడ ఇక్కడ అందిస్తాం.
పరీక్షలకు సంబందించి మీ ఆలోచనలు, డౌట్స్ కామెంట్లో తెలియజేస్తారని ఆశిస్తున్నాం. తదుపరి మీకు ఏ విషయంపై బ్లాగ్ పోస్ట్ కావాలంటే చెప్పగలరు.