(HOW TO PREPARE FOR RRB NTPC) RRB NTPC-2025 కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఎక్సామ్ పాటర్న్, టాప్10 టిప్స్ & స్టడీ ప్లాన్.. తెలుగులో..!

RRB NTPC అనగా Railway Recruitment Board Non-Technical Popular Categories. ఇది భారతదేశంలో రైల్వే రంగంలో ప్రభుత్వ ఉద్యోగం కోరుకునే వారికి సరైన మార్గం. అయితే, పోటీ కూడా అదే స్థాయిలో ఉంటుంది. కాబట్టి సరైన ప్రిపరేషన్ ప్లాన్, మంచి స్టడీ మెటీరియల్, మరియు నిరంతర కృషి అవసరం ఉంటే తప్ప ఉద్యోగం సాధించలేం.

ఈ ఆర్టికల్‌లో మనం ఉద్యోగ సాధనకు టాప్10 టిప్స్ మరియు డైలీ స్టడీ ప్లాన్‌ను చర్చించుకుందాం.

1. ఎగ్జామ్ ప్యాటర్న్

RRB NTPC ఎక్సామ్ రెండు దశలలో జరుగుతుంది. ఇవి కంప్యూటర్ ఆధారిత పరీక్షలు(Computer Based Tests).

CBT1:

CBT1 లో ఈ క్రింది అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నలన్నీ మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలే. మొత్తం 100 ప్రశ్నలను 90 నిమిషాలలో పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 1 మార్క్ రాగా, తప్పు సమాధానానికి 1/3వ వంతు నెగెటివ్ మార్కులు కూడా ఉంటాయనే విషయాన్ని గమనించుకోవాలి.

General Awareness – 40 Questions

Mathematics – 30 Questions

General Intelligence & Reasoning – 30 Questions

మొత్తం: 100 ప్రశ్నలు (90 నిమిషాలు)

CBT 2:

General Awareness – 50 Questions

Mathematics – 35 Questions

General Intelligence & Reasoning – 35 Questions

మొత్తం: 120 ప్రశ్నలు (90 నిమిషాలు)

2. సిలబస్ పైన అవగాహన:

ప్రతి సబ్జెక్ట్‌కు సంబంధించిన టాపిక్స్ తెలిసి ఉండాలి. ముఖ్యమైన టాపిక్స్ ని హైలైట్ చేయండి. ముందుగా వాటిని సమగ్రంగా సాధన చేసి, ఇతర అంశాలను స్పృశించాలి. సిలబస్ ను ఎలా చదవాలి అనే అంశం పట్ల అవగాహన, మీ ఉద్యోగ ప్రయత్నాలను మరింత మెరుగుపరుస్తుంది.

syllabus pdf

3.ఉత్తమ స్టడీ మెటీరియల్‌ ఎంపిక:

ప్రస్తుతం అన్ని భాషలలొ కూడా అనేక పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇలా అనేక రకాల పుస్తకాలను చదవటం కన్నా, మేలైన పుస్తకాన్ని ఎంపిక చేసుకుని, పలుమార్లు సాధన చేయడం ఉత్తమం. ఈ క్రింద కొన్ని పుస్తకాలను మీ అవగాహణకై ఉంచుతున్నాం.

Recommended Books:

Mathematics: R.S. Aggarwal, Fast Track Objective Arithmetic

Reasoning: Lucent Reasoning, R.S. Aggarwal Reasoning

General Awareness: Lucent GK, NCERT (6th to 10th Social & Science), Daily Current Affairs

4. డైలీ స్టడీ ప్లాన్:

ఇలాంటి పోటీ పరీక్షలలో నిలదొక్కుకోవాలంటే నిరంతర ప్రణాళికా బద్ధమైన కృషి అవసరం. కావున మీకున్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఒక చక్కని అనువైన ప్రణాళికను సిద్ధం చేసుకోండి. మీ అభిరుచిని బట్టి, మీ బలమైన మరియు బలహీన అంశాలను పరిగణలోకి తీసుకొని సమయాన్ని కేటాయించండి.

Eg: డైలీ ప్లాన్:

6:00 AM – Wake up & Revise Previous Topics

7:00 – 8:00 AM – Maths Practice

9:00 – 10:00 AM – Reasoning

11:00 – 12:00 PM – GK & Current Affairs

4:00 – 5:00 PM – Mock Test

6:00 – 7:00 PM – Mock Test Analysis

9:00 – 10:00 PM – Revision

ఇలా సుమారుగా కనీసం 6 నుంచి 8 గంటల సమయాన్ని కేటాయించండి.

5. Online Mock Tests:

మీరు అంశాల వారీగా ఎంత సాధన చేసినా పరీక్షను సమర్ధంగా ఎదుర్కొనుటకు మాక్ టెస్ట్స్ వ్రాయడం ముఖ్యం. పరీక్షా విధానం, ప్రశ్నలు అడిగే తీరు పట్ల అవగాహన పెరగడానికి ఈ నమూనా పరీక్షలు ఎంతగానో ఉపయోగపడతాయి. అటువంటి websites ను ఈ కింద తెలపడం జరిగినది.

మంచి వెబ్‌సైట్స్:

Testbook

Oliveboard

Gradeup

Adda247

PracticeMock

6. టైమ్ మేనేజ్‌మెంట్ – ప్రాక్టీస్:

పోటీ పరీక్షలో టైమ్ మ్యానేజ్మెంట్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. ఉద్యోగి భావితవ్యాన్ని నిర్ణయించేది ఈ సమయమే. అతి తక్కువ సమయంలో ఖచ్చితమైన సమాధానాన్ని గుర్తించడం సులభమైన పని కానందున ఈ విషయంపై అభ్యర్ధులు ప్రత్యేక శ్రద్ద పెట్టాల్సి ఉంటుంది. ప్రతి రోజు టైమ్ పెట్టుకుని ప్రాక్టీస్ చేయండి. నిజాయితీగా మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీకు అనువైన ఫలితాలు రానంతమాత్రాన నిరాశ చెందకుండా సాధన చేయడం ద్వారా విజయనానికి మరింత చేరువవుతారు.

7. గత సంవత్సరం కట్ ఆఫ్:

గత పరీక్షల యొక్క క్యాట్ ఆఫ్ గమనించడం ద్వారా మన లక్ష్యం ఏంటి అనే విషయాన్ని నిర్ణయించుకోవాలి. ప్రస్తుత పరిస్తితికి తగ్గట్లు సాధనను మెరుగు పరుచుకోవాలి. పరీక్షల శైలిని గమనిస్తూ సాధన చేయడం ఉత్తమం.

8. స్ట్రాంగ్ అండ్ వీక్ ఏరియాస్:

మాక్ టెస్ట్స్ ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరు ఏ టాపిక్‌లో బలంగా ఉన్నారో, ఎక్కడ వీక్‌గా ఉన్నారో తెలుసుకోవచ్చు. వీక్ ఏరియాస్‌పై ప్రత్యేక శ్రద్ధ పెడుతూ సాధనకు అధిక సమయాన్ని కేటాయించడం ద్వారా ఈ సమస్యను సులభంగా అధిగమించవచ్చు.

9. డైలీ కరెంట్ అఫైర్స్:

జాతీయ అంతర్జాతీయ అంశాల పట్ల అవగాహనను పెంచుకోవాలి. ఏదో ఒక సమయంలో అంతా చదవాలి అనుకునే కన్నా, వర్తమాన అంశాలను నిరంతరం నేర్చుకొనడమే ఉత్తమమైన పని. కావున కరెంట్ అఫ్ఫైర్స్ ను రోజువారీ నేర్చుకొనుట వలన అధిక సమయం మిగులుతుంది.

ప్రతిరోజూ 15–20 నిమిషాలు కరెంట్ అఫైర్స్‌కు కేటాయించండి. మ్యాగజైన్స్ లేదా యూట్యూబ్ ద్వారా ప్రిపేర్ కావచ్చు.

10. మోటివేషన్‌:

పరీక్షల ప్రిపరేషన్ లో Consistency చాలా ముఖ్యమైంది. అనేక అడ్డంకులు, విమర్శలు, ఓటములు ఎదురైనా మొక్కవోని దీక్షతో లక్ష్యాన్ని చేరుకొనుటకు మోటివేషన్ అవసరం,  మోటివేషన్ తగ్గినప్పుడు ఈ లక్ష్యాన్ని నిర్దేశించుకోవడానికి గల కారణాన్ని జ్ఞప్తికి తెచ్చుకోండి. లక్ష్యాన్ని సాధించడం వలన భవిష్యత్ మార్పులను ఊహించుకోండి. మీకు మీరుగానే ఉత్తేజితులు కండి. మంచి స్నేహితుల సలహాలను స్వీకరించండి లేదా సక్సెస్ స్టోరీస్ వినండి.

చివరిగా..!

RRB NTPC ఒక మంచి అవకాశం. సరైన ప్రిపరేషన్ ప్లాన్, కఠినమైన కృషి మరియు సమయపాలన ఉంటే విజయం మీదే. మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించవచ్చు. రోజుకి కనీసం 6 గంటలు స్టడీ టైమ్ కేటాయించండి. అయితే ఈ ప్రయాణంలో మానసికంగా సారికంగా దృడంగా ఉండటం చాలా అవసరం. కావున మెరుగైన ఆరోగ్యం కోసం ఉదయం నడక, యోగా, ద్యానం లాంటివి సాధన చేస్తూ మనసును, దేహాన్ని ఆరోగ్యంగా ఉంచుకోండి.

    “నిరుద్యోగం అనే భూతాన్ని వదిలించే అద్భుత మంత్రం – సాధన”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top